జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పటికీ బీజేపీ గూటిలోనే ఉన్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. ఏపీ రాష్ట్ర రాజకీయాలపై కె.నారాయణ స్పందించారు. మోదీ షేక్ హ్యాండ్కే చంద్రబాబు మురిసిపోతున్నారని నారాయణ ఎద్దేవా చేశారు. ఏపీలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారికే సీపీఐ మద్దతు దక్కుతుందని తేల్చి చెప్పారు. దేశంలో ఎన్డీఏకు వ్యతిరేకత మొదలైందని, బీజేపీ వ్యతిరేక శక్తులను కలిపే పనుల్లో సీపీఐ ఉందని ఆయన తెలిపారు.