శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చు. చేపలను తినటం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు.
చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయని, ఆరోగ్యంగా ఉండటానికి, వారానికి రెండు, మూడు సార్లు ఆవిరి లేదా కాల్చిన చేపలను తినాలని సూచిస్తున్నారు.