ఆస్తులు బదలాయించిన తరువాత వారసులు తమను సరిగా చూసుకోకపోతే ఆ నిర్ణయాన్ని రద్దు చేసుకునే అధికారం చట్టం ప్రకారం వృద్ధులకు ఉంది. అయితే ఆ నిబంధన 2018 సెప్టెంబర్ తర్వాత బదలాయింపులకే వర్తిస్తుంది. దీన్ని సవాలు చేస్తూ 97ఏళ్ల వృద్ధుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. 2007 మే నెలలో తన ఇళ్లను ఇద్దరు కొడుకులకు ఇచ్చానని, ఇప్పుడు వాళ్లు తనను చూసుకోవడం లేదని, ఇళ్ల బదలాయింపును రద్దు చేసే అవకాశం కల్పించాలని కోరాడు.