ఆసియా కప్‌కు ముందు భారత్ క్రికెట్ జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కరోనా బారిన పడ్డాడు. త్వరలో టీ20 వరల్డ్ కప్ కూడా ఉండడంతో ద్రవిడ్ గైర్హాజరీ ప్రభావం జట్టుపై పడుతుందేమోనన్న ఆందోళన నెలకొంది. రాహుల్ ద్రవిడ్ ఇటీవల ముగిసిన 3-మ్యాచ్‌ల సిరీస్ కోసం జింబాబ్వేకు కూడా వెళ్లలేదు. ద్రవిడ్ కోలుకోవాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.