జగన్ రెడ్డి పాలనలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తమని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. వేంపల్లి పట్టణంలో ఆయన మాట్లాడుతూ. విద్యార్థుల పాలిట శకుని మామగా కంసుని మామగా తయారయ్యాడన్నాడు. పాఠశాల విద్యను చీలికలు పేలికలు చేశాడు. మూడు నాలుగు ఐదు తరగతులను పాఠశాల నుంచి విడగొట్టి హైస్కూల్లో కలపడం పిచ్చి తుగ్లక్ చర్యలు అన్నారు. పాఠశాలలు తెరిచి 40 రోజులైనా ఇప్పటికీ అనేక పాఠశాలకు పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు, అందలేదు.
పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జారీచేసిన జీవో 85 ఒక చారిత్రాత్మక తప్పిదం, పీజీ కళాశాలలో విద్యా దీవన, వసతి దీవెన రద్దుచేస్తూ జారీ చేసిన జీఓ77 వలన పేదవిద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యారు. మేస్ చార్జీలు చాలనందువల్ల హాస్టల్లో హాహాకారాలు వినిపిస్తున్నాయి. ఆగస్టు చివరికి వచ్చిన ఇంకా ప్రతిష్టాత్మకమైన ట్రిబుల్ ఐటి అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ జారీ జారీ కాకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.