ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజారాజ్యం పార్టీలో అసలైన కోవర్ట్ పవన్ కళ్యాణే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 23, 2022, 03:54 PM

చిరంజీవి లేకపోతే పవన్ ఎక్కడున్నాడ‌ని మాజీ మంత్రి  వెలంపల్లి శ్రీనివాస్  ప్ర‌శ్నించారు. చంద్రబాబు దత్తపుత్రుడు షూటింగ్ గ్యాప్లో బయటికి వచ్చి.. సంక్షేమ పాలన అందిస్తున్న ప్రభుత్వంపై అక్కసు వెల్లగక్కుతున్నాడని మండిపడ్డారు. 


నగరంలోని పశ్చిమ నియోజకవర్గం 56వ డివిజన్‌లో గడప గడపకూ మన ప్రభుత్వంలో పాల్గొన్న వెలంపల్లి.. పవన్‌ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబు దత్తపుత్రుడు షూటింగ్ గ్యాప్ లో బయటికి వచ్చాడు. ప్రజారాజ్యం పార్టీలో అసలైన కోవర్ట్ పవన్ కళ్యాణే. చిరంజీవికి అధికారం రాలేదని.. ఆయన్ని పక్కకి పెట్టింది పవనే. 


ప్రజారాజ్యానికి 18 సీట్లు వచ్చాయని అసలు పార్టీలో కనపడకుండా పోయాడు. నాడు ప్రజారాజ్యం ను విలీనం చేయవద్దని పవన్‌ ఎందుకు చెప్పలేకపోయాడు?. అసలు ప్రజారాజ్యం పార్టీ విలీనానికి కారణమే పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com