చిత్తూరు: నగరి మండలం నంబాకం సచివాలయం పరిధిలోని దేసూరు అగరం, దేసూరు దళితవాడ, ఎస్. టి. కాలనీలలో మంత్రి ఆర్. కె. రోజా గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు. దేసూరు అగరంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను గురించి లబ్ధిదారులకు వివరించారు. స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.