చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని తమ్మిరెడ్డిపల్లె సమీపంలోని కౌండన్య నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను రెవిన్యూ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానిని రెవిన్యూ కార్యాలయంలో అప్పగించారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ మురళి ఈ సందర్భంగా హెచ్చరించారు. అక్రమ ఇసుక రవాణా చేసిన వారు తమకు సమాచారం అందివ్వాలని తెలిపారు.