వైఎస్ఆర్ కడప జిల్లా: మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురాం రెడ్డి పై మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ. ఆయన మత్తెక్కి, మతి భ్రమించి, దిగజారుడు తనంతో మాట్లాడడం మంచి పద్ధతి కాదని ఇలా మాట్లాడి ప్రజల దృష్టిలో చులకన కావద్దని సున్నితంగా మాజీ మంత్రి డి. యల్ రవీంద్రారెడ్డిని హెచ్చరించారు. మైదుకూరు నడిబొడ్డులో వైయస్ జగన్ సమక్షంలో కండువా కప్పించుకున్న నీకు నేడు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఎందుకు దొరకడం లేదో. ఆత్మ విమర్శ చేసుకోమని హితవు పలికారు.