సత్తెనపల్లి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా జనసేన నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో రైల్వే స్టేషన్ రోడ్డులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నాయకులు చెప్పారు. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించే ఈ శిబిరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa