ప్రభుత్వ ఉద్యోగార్థులకు యూపీఎస్సీ గుడ్ న్యూస్ అందించింది. ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్ ను ప్రారంభించింది. ఇక నుంచి యూపీఎస్సీలోని వివిధ రిక్రూట్మెంట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నప్పుడు ప్రతిసారీ ప్రాథమిక వివరాలు ఇవ్వాల్సిన పనిలేదని అధికారులు తెలిపారు. upsc.gov.in వెబ్ సైట్ లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.