జిల్లాలో గ్రామాలను శుభ్రంగా ఉంచాలని, క్రమపద్ధతి ప్రకారం నీటి ట్యాంకులను శుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ ఈవో పీఆర్డీలను గ్రామ సెక్రటరీలను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ జిల్లాలో 697 గ్రామ పంచాయతీలకు గాను 580 ఎస్ డబ్ల్యూ పిసి షెడ్యూల్ ఉన్నాయని ఇందులో 382 మాత్రం పని చేస్తున్నాయని మిగతా వాటిని వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు.