అమెరికాలోని టెక్సాస్‌లో తీవ్ర కరువు కారణంగా డైనోసార్ వ్యాలీ స్టేట్ పార్క్‌లోని పాలక్సీ నది ఎండిపోయింది. దీంతో నదిలో 11.3 కోట్ల ఏండ్ల నాటి డైనోసార్ పాదముద్రలు బయటపడ్డాయి. ఈ అడుగులు అక్రోకాంతోసారస్ అనే జాతికి చెందిన డైనోసార్‌వి అని డైనోసార్ వ్యాలీ స్టేట్ పార్క్ అధికారిక ప్రతినిధి స్టెఫనై సలినాస్ గార్సియా పేర్కొన్నారు. ఈ డైనోసార్ 15 అడుగుల ఎత్తు, దాదాపు 7 టన్నుల బరువు ఉంటుందని తెలిపారు.