ఛత్తీస్‌గఢ్ లోని రాయ్‌పుర్ లో దారుణం జరిగింది. ప్రకాశ్ అనే వ్యక్తి ఎస్బీఐ కస్టమర్ సర్వీస్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అయితే ఆ సెంటర్ లో ఓ యువకుడు పట్టపగలే చోరీకి పాల్పడ్డాడు. సుత్తితో నిర్వాహకుడి తలపై దాడి చేసి, కౌంటర్లో ఉన్న డబ్బు తీసుకుని పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన నిర్వాహకుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.