థాయిలాండ్ ప్రధానిపై ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం వేటు వేసింది. ప్రధానమంత్రి పదవీ కాలం ముగిసిన ఇంకా కొనసాగుతున్నారంటూ ఆయనను పదవీ బాధ్యతల నుంచి సస్పెండ్ చేసింది. థాయిలాండ్ ప్రధాని ప్రయూత్ చాన్-వో-చాను పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ఆయన ఇంకా పదవిలో కొనసాగుతున్నారంటూ ప్రతిపక్షాలు కోర్టును ఆశ్రయించాయి. విచారించిన న్యాయస్థానం ప్రతిపక్షాల వాదనతో ఏకీభవిస్తూ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa