కుప్పంలో అన్న క్యాంటీన్ పై వైకాపా దాడిని ఖండించిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు. ఆకలితో ఉన్న పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలనే సంకల్పంతో కుప్పంలో నారా చంద్రబాబు నాయుడుచే ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న "అన్న క్యాంటీన్" పై దాడి చేసి విద్వంసం సృష్టించిన వైసిపి గుండాల అరాచక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానట్లు ఎంపీ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా టీడీపీ కార్యాలయం నుంచి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. పేదవాడి ఆకలి తీర్చాలనుకున్న వారిని అడ్డుకోవడం, వారి పై దాడులు చేయడం ఇదేనా మీ నాయకుడు గొప్పగా చెప్పుకునే ప్రజా సంక్షేమ పాలన? అని అని ఏద్దేవా చేశారు. పేదల ప్రజల సంక్షేమం పై నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇలా దుర్మార్గపు చర్యలకు ఒడిగట్టరని అన్నారు. ఈ దాడులు ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో ఓ భాగమని ఎంపీ వ్యాఖ్యానించారు.
చేతనైతే పేదవాడి ఆకలి తీర్చాలి కాని పేదవాడి ఆకలి తీర్చాలనుకున్న వారిపై అనాగరికలు సైతం సిగ్గు పడే విధంగా దాడులు చేయడమెంటని నిలదీశారు. మీకు ప్రజలు అవకాశాన్ని ఇచ్చింది, ప్రజాసేవ చేయడానికి కానీ రౌడీయిజం చలాయించడానికి కాదని అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్ని మభ్యపెట్టి కనిపించిన ప్రతిదాన్ని కూల్చేస్తూ విద్వంసక పాలన సాగిస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. జగన్ అధికారం కోల్పోతామని భయంతోనే వైసిపి గుండాలతో ఈ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ ఏపీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారనేదానికి ఈ భౌతిక దాడులే నిదర్శనమని పేర్కొన్నారు. ఇటీవల పలాసలో వైసిపి నేతల భూ ఆక్రమణల భాగోతాన్ని బయట పెట్టినందుకు అక్కడ వారి ఇల్లు కూల్చారనని తెలిపారు. ఇప్పుడు అధికారమదంతో, మత్తులో పేదవాడి ఆకలి తీర్చే "అన్న క్యాంటీన్" లపై దాడులు చేస్తూ దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.