ఐక్య రాజ్య సమితి భద్రతామండలి సమావేశాల్లో తాజాగా జరిగిన ఓటింగ్లో భారత్.. ఉక్రెయిన్ అంశంలో రష్యాకు వ్యతిరేకంగా తొలిసారి ఓటు వేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీని భద్రతామండలిని ఉద్దేశించి ప్రసగించడానికి ఆహ్వానించాలా?వద్దా? అనే అంశంపై ఓటింగ్ నిర్వహించారు. అయితే భద్రతామండలిలో ప్రసంగానికి జెలెన్ స్కీని ఆహ్వానించడాన్ని వ్యతిరేకించాలంటూ ఐరాసలో రష్యా సభ్యదేశాలను అర్థించింది.