నాడు - నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో గణనీయంగా విద్యాభివృద్ధి జరుగుతోందని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. జలుమూరు మండలం పాగోడు జిల్లా పరిషత్ పాఠశాలలో నాడు-నేడు నిధులు రూ. 42లక్షలు, అదనపు తరగతి గదుల నిధులు రూ. 91లక్షల పనులకు మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ, విద్యారంగానికి సీఎం జగన్ ఎంతో చేయూతనందిస్తున్నారన్నారు. చిన్నారులకు విద్యాకానుక మొదలు అమ్మఒడి, విద్యాదీవెన, విద్యావసతి దీవెన ఇలా అనేక పథకాలతో విద్యార్ధులకు భరోసానిస్తున్నారన్నారు.
నాడు-నేడు ద్వారా అన్ని విద్యాసంస్థల రూపురేఖలు మార్చేస్తూ ఒక ఆహ్లాదకరమైన పరిసరాల్లో విద్యాభోధన జరిగేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. యువ నాయకుడు, పోలాకి జడ్పీటీసీ ధర్మాన కృష్ణ చైతన్య, జలుమూరు ఎంపీపీ వాన గోపి, జడ్పీటీసీ మెండ విజయశాంతి, వైస్ ఎంపీపీ తంగి మురళి, పీఎసీఎస్ అధ్యక్షుడు పాగోటి రాజప్పలనాయుడు, పొన్నాన ముసలి నాయుడు, పాగోడు సర్పంచ్ దాము మన్మధరావు, ఎంపీటీసీ రావాడ చంద్రం, జలుమూరు వైయస్సార్సీపీ పార్టీ అధ్యక్షుడు మొజ్జాడ శ్యామలరావు, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.