చట్టసభల్లో సాంకేతిక వినియోగం పెరగాలని పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు ప్రజాస్వామ్య సమాజo యొక్క మూల స్తంభాలలో ఒకటిని, ఇవి ప్రజాస్వామ్య విలువల ప్రచార సాధనాలుగా నిలుస్తూ, కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సంస్థాగత దృక్కోణం లో, పార్లమెంటులు చట్టాలను రూపొందిస్తున్నాయన్నారు. కెనడా దేశంలో ఫాలిఫాక్స్ నగరంలో 65వ పార్లమెంటరీ కామన్వెల్త్ సమావేశంలో ఆయన ఆంధ్ర ప్రదేశ్ నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగాన్ని స్పీకర్ కార్యాలయ అధికారులు పత్రికా ప్రకటన రూపంలో చర్చ సారాంశాన్ని గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ ప్రాధాన్యతతో పాటు, వనరులను కేటాయింపు, వివిధ నియోజకవర్గాలు, రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహించటం లో చట్టసభలు ముఖ్య వేదికలుగా నిలుస్తున్నాయన్నారు.
ప్రభుత్వ కార్యనిర్వాహక శాఖను పర్యవేక్షిoచడంతో పాటు, పబ్లిక్ పాలసీని చర్చించడానికి, ఏకాభిప్రాయ దిశగా పలు ప్రజాసమస్యలు పై చర్చలు ప్రోత్సహించడానికి ప్రధాన వేదికలుగా చట్టసభలు నిలుస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పార్లమెంటరీ వ్యవస్థ కొనసాగుతున్న పలు దేశాల్లో ఇన్నోవేషన్ అనేది ఉపయుక్తకరంగా నిలుస్తోందని అన్నారు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐ సి టి) బలోపేతం చేయడం ద్వారా చట్టసభల్లో జరుగుతున్న కార్యకలాపాలు ప్రజలు తెలుసుకునే వీలుoటుందన్నారు. దీనివలన చట్టసభల్లో జవాబుదారీతనం పెరిగే వీలుందన్నారు. ఈ -పార్లమెంట్ నినాదం. ఈ-ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుందన్నారు. ఇది సామాజిక, ఆర్థిక విషయాల్లో ప్రజలను చైతన్యవంతం చేసి, పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. పార్లమెంటు సభ్యులు మరియు సాధారణ పౌరుల మధ్య పరస్పర చర్యలను బలోపేతం చేయడంలో ఇది సహాయపడుతుందన్నారు.
సమర్థవంతమైన ప్రభుత్వ సేవల కల్పనను సులభతరం చేస్తుందన్నారు. సామాజిక భాగస్వామ్యం మెరుగుపరుస్తూనే, ప్రభుత్వ సేవల్లో పారదర్శకతను అనుమతిస్తుందన్నారు. డిజిటల్ హౌస్ సభ్యుల కోసం డిజిటల్ పార్లమెంట్, సభ్యుల పోర్టల్, మొబైల్/టాబ్లెట్ యాప్‌లు వంటి వాటిని బలోపేతం చేయటంలో ఐ సి టి కీలకంగా నిలుస్తుందని ఆయన ప్రశంసించారు. ఇది అంతర్గతంగా చట్టసభల్లో నిర్మాణాత్మకమైన, గణనీయమైన పురోగతి కనిపించే అవకాశాలు ఉంటాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక పార్లమెంటరీ వ్యవస్థల్లో పలు విభాగాలు, వాటి ముఖ్య విధులను మెరుగుపరచడానికి, బలోపేతం చేయడానికి ఐ సి టి లను అమలు చేయడాన్ని స్వాగతించారు ఉన్నారు. సమాచార స్వేచ్ఛా ప్రవాహం మరియు పౌరుల చురుకైన భాగస్వామ్యం అనేది, విజయవంతమైన ప్రజాస్వామ్యానికి పునాదన్నారు. ఐసీటీ వలన కమ్యూనికేషన్ మరియు జవాబుదారీ పారదర్శకతను ప్రోత్సహిస్తుందన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ప్రారంభించిందన్నారు.
ప్రాజెక్ట్ మొత్తం వ్యయం 738 కోట్లకు పైగా ఉందన్నారు. దేశం లో మొత్తం 31 రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల శాసనాoగాలను, వాటి పనితీరును మెరుగుపరచడం దీని లక్ష్యం అన్నారు. భారత పార్లమెంట్‌తో వీటిని అనుసంధానించి, సాంకేతికతను అభివృద్ధి పరచటమనే ఏకైక ఆశయం తో కొనసాగుతుందన్నారు. అనేక దేశాలలో, మెజారిటీ పౌరులు ఇప్పుడు వారి స్మార్ట్ ఫోన్‌లకు అతుక్కుపోయారని, మొబైల్ అప్లికేషన్‌లను వారితో కనెక్ట్ చేయడానికి మరియు పార్లమెంటరీ సమాచారాన్ని పంచుకోవడానికి సులభమైన మార్గంగా మార్పు చెందిoచడం జరిగిందన్నారు. పారదర్శకత మరియు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి మొబైల్ అప్లికేషన్ ఒక ఉపయోగకరమైన సాధనంగా నిలుస్తుందన్నారు. పార్లమెంట్ హౌస్ ప్రొసీడింగ్స్, ప్రశ్నలు-సమాధానాలు, చర్చలు, సభ్యుల గురించి సమాచారం మరియు వ్యాపార జాబితా, బులెటిన్‌ల ప్రత్యక్ష ప్రసారానికి, వినియోగదారులను సులభంగా యాక్సెస్ చేయడానికి లోక్‌సభ మొబైల్ అప్లికేషన్ (యాప్)ను ప్రారంభించిందన్నారు. ఈ యాప్ సభ్యులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రజలు డౌన్‌లోడ్ చేసుకునేలా చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగ నిలుస్తుందన్నారు. తద్వారా ప్రజలు చట్టసభల్లో సభ్యుల ప్రవర్తనను తెలుసుకునే వీలుoదన్నారు.
పార్లమెంటరీ టీవీ ఛానెల్‌లు పార్లమెంటరీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా పారదర్శకతను నిర్ధారించడానికి ఒక వినూత్న విధానమని తమ్మినేని అభిప్రాయపడ్డారు. "పార్లమెంటు హౌస్‌లో పార్లమెంటు సభ్యుని పని పట్ల, పౌరుల అవగాహన. పాలనా ప్రక్రియలో మంత్రులు, అధికారులు గురించి అవగాహన తీసుకురావడంలో సహాయపడుతుందన్నారు. భారత పార్లమెంటు సభా కార్యక్రమాలను సంసద్ టెలివిజన్ ప్రసారం చేస్తుందన్నారు. భారతదేశం యొక్క పార్లమెంటరీ ఛానెల్ గా ఇది గుర్తింపు పొందిందన్నారు. వివిధ కోణాలను నిష్పాక్షికంగా ఇది ప్రసారం చేస్తుందన్నారు. భారతదేశంలోని పార్లమెంటరీ మరియు శాసనసభల పనితీరును, భారత పౌర సమాజానికి అందుబాటులో ఉంచడం విని ఉద్దేశమన్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక జీవితంలోని అన్ని అంశాలపై సంతకం చేస్తూ ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే వేదికగా సంసద్ ఛానల్ నిలుస్తుందన్నారు.