కుప్పంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పై అన్న క్యాంటీన్ పై వైసిపి నాయకులు దుచర్య ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని గురువారం పలాస టిడిపి కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో టిడిపి ప్రధాన కార్యదర్శి గౌత శిరీష అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నాశనం అవుతున్న పోలీస్ డీజీపీ ఎక్కడ ఉన్నారో అర్దం కావడం లేదని, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందన్నారు. 99 శాతం పోలీసులు వైసిపి చేతిలో కీలబొమ్మలాగా మారిపోయారని, అక్కడక్కడ ఒక శాతం బాధ్యత గల పోలీసుల కనిపిస్తున్నారని ఆమె అన్నారు. పా పార్టీ నాయకులు బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుందని, గతంలో ఎన్నడూ లేనివిధంగా చెత్త పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని, కుప్పంలో పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ప్రారంభించడం తప్పా అని ప్రశ్నించారు.
ఎక్కడికి వెళ్ళినా దాడులు వైసీపీ వారు చేస్తున్నారని, అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అని ఆమె ప్రశ్నించారు. ఈ రోజు జరిగిన పరిణామాలు తీవ్రంగా ఖండిస్తున్నాం అని, మా నాయకుడు పిలుపు ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మా రక్షణ మేము చూసుకోవాలని 70 లక్షల కార్యకర్తలు రోడ్డు మీదకి వస్తె ఏమౌతుందో తెలుసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు పై జరిగిన దాడి హేయమైన చర్య, మారాల్సింది రాజకీయనాయకులు కాదు, ప్రజలు మారాలి, సొంత బాబాయ్ నీ హత్య చేయించిన వాడికి ఓట్లు వేస్తే పాలన ఇలాగే ఉంటుందని తెలియజేశారు. ప్రతిపక్షాలను తిరగనీయరా! రేపు ఎన్నికల్లో ఇలాగే చేస్తారా అని ఆమె ప్రశ్నించారు.
ఓట్లు విషయం వదిలి హక్కులు కొరకు పోరాడటానికి ప్రతిపక్షాలు కలసి రావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు నమ్మకం పోయి రోడ్డు మీదకు వస్తె పోలీసులు పరిస్థితి ఎమిటో ఆలోచించాలని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వజ్జ బాబురావు, రాష్ట్ర బిసి సెల్ ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు, సప్ప నవీన్, గంగారాం, జన అప్పారావు, నరసింహ, నెయ్యల శివ, ధనుంజయ, కుమారరాజు మొదలైన వారు పాల్గొన్నారు.