ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలని వైద్యులు చెబుతుంటారు. చాలా మంది చలికాలంలోనే కాదు ఏ సీజన్ లో అయినా వేడి వేడి ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. కానీ అతిగా వేడి ఆహారం తీసుకోవడం ద్వారా లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. ఎక్కువ వేడి ఆహారం వలన కడుపులో సున్నితమైన చర్మంపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. దీని వల్ల గుండెల్లో మంట రావొచ్చు. ఎక్కువ వేడి ఆహారం దంతాలను దెబ్బతీస్తాయి. అధిక వేడి మీ దంతాల ఎనామెల్‌ఫాట్‌కు దారితీసే అవకాశం ఉంది. అధిక వేడి ఆహారం తీసుకోవడం ద్వారా నాలుక, నోటి చర్మం దెబ్బతింటుంది. ఫలితంగా దీర్ఘకాలంలో ఇతర సమస్యలు ఎదుర్కొవాల్సిన పరిస్థితి రావొచ్చు.