తెలుగుదేశంనేత నారా చంద్రబాబు నాయుడుకు తన సొంత నియోజకవర్గం కుప్పంలో నిరసనలు ఎదురవ్వగానే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల గుర్తుకొచ్చిందని అంతటితో ఆగకుండా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది ‘తుమ్మితే ఊడిపోయే ముక్కు’ అంటూ అడ్డదిడ్డంగా, ఏ లాజిక్కుకు అందని భాషలో మాట్లాడుతున్నారని రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి అన్నారు. 72 ఏళ్ల ఈ సీనియర్ రాజకీయవేత్త. రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీలో మున్నెన్నడూ లేని మెజారిటీతో ఐదేళ్ల పదవీకాలానికి ఎన్నికైన పాలకపక్షం తుమ్మితే, దగ్గితే ఎలా అధికారం ఎలా కోల్పోతుందో చంద్రబాబు కాస్త వివరంగా సెలవిస్తే ఆంధ్రులు సంతోషిస్తారన్నారు.
తాను సీఎంగా ఉన్నప్పుడు, విపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా తన పర్యటనల్లో ప్రజాగ్రహం ఎదురైతే ఇలా మతి కోల్పోయి మాట్లాడం ఆయనకు అలవాటే, తాను పుట్టి పెరిగి, కేజీ నుంచి పీజీ దాకా చదువుకున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకర్గంలో చంద్రబాబు వంటి రాజకీయ కురువృద్ధుడు హాయిగా తిరిగేలా ఉండాలని ఆయన జనంతో ముచ్చటిస్తూ, వారి బాగోగులు వాకబు చేస్తూ వారితో మమేకం కావాలి. అంతేగాని, సంయమనం కోల్పోయి రెచ్చిపోతే 39 ఏళ్ల వయసులోనూ రాజకీయంగా ఇంకా ‘ముక్కు పచ్చలారని’ లోకేష్ బాబు తండ్రి వాటం చూసి రాష్ట్ర సర్కారుపై మరింత బిగ్గరగా రంకెలేయ్యడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తుమ్ములు, దగ్గులూ అంటూ హేతుబద్ధం కాని విమర్శలకు తెగబడితే ఆయనకే చేటు. వచ్చే ఎన్నికల్లో పాలకపక్షానికి ఒక్క సీటూ రాదూ, పులివెందుల లోనూ ఎదురుదెబ్బలు తప్పవన్నారు.