పోలీసు కస్టడీలో ఉన్న టీడీపీ సానుభూతిపరులపై ఇంత దారుణంగా హింసకు తెగబడతారా? అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చేమ్ నాయుడు ప్రశ్నించారు. తాడిపత్రి లో వైసీపీ నేతలకి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు అనే నెపంతో, వేరే వ్యవహారాలలో వీరికి సంభంధం ఉందంటూ వీరిపై కేసు మోపి పోలీస్ వారు అరెస్ట్ చేసారు అంటూ ఈ సంఘటన పై స్పందిస్తూ.... డీజీపీ గారు, ఇది ఇంకా మీ దృష్టి కి రాలేదా? ఆ డీఎస్పీపై మీరు చర్యలు తీసుకుంటారా? లేదా? ఇది ఖచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘనే.
రాజ్యాంగం అనేది ఒకటి ఉంది అని ఏపీలో అధికార పార్టీ ఎప్పుడో మర్చిపోయింది. ఇప్పుడు కొందరు పోలీసు అధికారులు వారికి వత్తాసు పలుకుతున్నారు. అటువంటి అధికారులను సన్మార్గంలో పెట్టవలసిన బాధ్యత మీపైన ఉంది. ఈ ఘటనకు బాధ్యులు అయిన అధికారులపై మీరు వెంటనే చర్య తీసుకోని పక్షంలో దీనిపై ఖచ్చితంగా న్యాయపోరాటం చేస్తాము అని ఆయన హెచ్చరించారు.