ప్రపంచ దేశాధినేతల్లో ఉత్తమ నేతగా ప్రధాని మోడీ హవా కొనసాగిస్తున్నారు. తాజాగా అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో మోడీ తొలి స్థానంలో నిలిచారు. దేశంలో ఆయనకు 75 శాతం ప్రజలు మద్దతు పలికినట్లు సర్వే వెల్లడించింది. ఈ జాబితాలో 2వ స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్, 3వ స్థానంలో ఇటలీ ప్రధాని మారియో ద్రాగి ఉన్నారు. యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ 5వ స్థానంలో నిలిచారు.