ఉప రాష్ట్రపతిని వైసీపీ ఎంపీ ఎస్. నిరంజన్ రెడ్డి రెడ్డి కలిశారు. తెలంగాణకు చెందిన యువ న్యాయవాది. వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాఖలైన కేసుల్లో జగన్ తరఫున వాదనలు వినిపించే లాయర్ ఎస్. నిరంజన్ రెడ్డి. ఇటీవలే ఏపీ కోటాలో నాలుగు రాజ్యసభ సీట్లు భర్తీ కాగా... వాటిలో రెండు సీట్లను రాజకీయ నేతలకు ఇచ్చిన జగన్... మిగిలిన రెండు సీట్లను తెలంగాణకు చెందిన రాజకీయేతరులకు ఇచ్చారు. ఈ దిగువ కోటాలోనే ఎస్. నిరంజన్ రెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని దక్కింకున్నారు.
వైసీపీ రాజ్యసభ సభ్యుడి హోదాలో నిరంజన్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి భవన్‌లో కనిపించారు. ఇటీవలే భారత ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జగదీప్ ధన్‌కడ్‌ను పలువురు ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. పూర్వాశ్రమంలో న్యాయవాదిగా ఉన్న జగదీప్ ఆ తర్వాతే రాజకీయాల్లోకి వచ్చారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న నిరంజన్ రెడ్డి శుక్రవారం జగదీప్‌ను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోను ఉపరాష్ట్రపతి భవన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.