బెంగళూరులోని చామరాజ్‌పేటలోని వివాదాస్పద ఈద్గా మైదానంలో గణేష్ చతుర్థి వేడుకలను నిర్వహించేందుకు కర్ణాటక హైకోర్టు శుక్రవారం అనుమతినిచ్చింది. యథాతథ స్థితిని కొనసాగించాలని ఆగస్టు 25న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది.అయితే, రాష్ట్ర రెవెన్యూ శాఖ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించగా, అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి ఆగస్టు 15న తొలిసారిగా ఈద్గా మైదానంలో జెండాను ఎగురవేశారు.మరోవైపు గణేశ చతుర్థి వేడుకలను ప్లేగ్రౌండ్‌లో నిర్వహించాలని కొన్ని హిందూ సంస్థలు డిమాండ్ చేశాయి.