దేశంలో కరోనా రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో 9,520 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కరోనా బారిన పడిన వారిలో 12,875 మంది కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 87,311కు చేరింది. రోజువారీ నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడం ఊరటనిస్తోంది.