శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ప్రాజెక్ట్‌లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. అధికారులు ఒకగేటు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో 93,899 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 69,916 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 885 అడుగులుగా కొనసాగుతుంది. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.