పర్యావరణ హితమే లక్ష్యంగా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే డీజిల్ కార్లపై నిషేధించిన ఆ రాష్ట్రం తాజాగా పెట్రోల్ కార్లను కూడా నిషేధించనుంది. 2035 నాటికి పెట్రోల్ కార్లు పూర్తిగా నిషేధించాలని నిర్ణయించింది. తద్వారా శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయని అంచనా వేసింది. పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ కార్ల సంఖ్యను గణనీయంగా పెంచనున్నట్లు వెల్లడించింది.