సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యుయు లలిత్ శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. భారత 49వ సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న యుయు లలిత్ త్వరలో పలు కీలక కేసుల విచారణ చేపట్టనున్నారు. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, రాజకీయ పార్టీలకు విరాళాలు, ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లు వంటి వాటిని విచారించనున్నారు.