కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మరో 14 రోజుల్లో కొత్త పార్టీని స్థాపించబోతున్నారు. ఈ విషయాన్ని ఆజాద్ సన్నిహితుడు, జమ్మూకశ్మీర్ మాజీ మంత్రి జీఎం సరూరి వెల్లడించారు.సెప్టెంబర్ 4న ఆజాద్ జమ్ముకశ్మీర్‌కు వస్తున్నారని, అదే రోజు పార్టీ ఏర్పాటుపై స్థానిక నేతలతో చర్చించనున్నారని తెలిపారు. ముందుగా రాష్ట్ర స్థాయిలో పార్టీ ఏర్పాటు చేస్తామని, ఆ తర్వాత జాతీయ పార్టీ అంశాన్ని పరిశీలిస్తామని జీఎం సరూరి చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa