పెదకూరపాడు: నియోజకవర్గానికి చెందిన అమరావతి మండలం ధరణికోట గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆలపాటి వీరయ్య ని పెద్దకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు ఆదివారం పరామర్శించారు. ఇటీవల వీరయ్య ప్రమాదానికి గురై ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన వెంట వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు హనుమంతరావు భాష, శ్రీనివాసరావు, నాగయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.