తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ప్రభుత్వంలో వినాయక చవితి మండపాలకు విద్యుత్ సరఫరాకు సంబంధించి 500 మెగావాట్ లోడు వరకూ వెయ్యి రూపాయలు వసూలు చేశారు. మండపాల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఎలాంటి నిబంధనలు తీసుకురాకపోయినా .. ప్రభుత్వం పండుగలు జరుపుకోకుండా ఇబ్బందులు పెడుతోందని, ఆంక్షలు విధిస్తుందంటూ పదేపదే మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
రాజకీయం చేయడానికి ఏ విషయం లేకపోవడంతో ఆఖరికి వినాయకుడి పండుగనూ రాజకీయం చేస్తున్నారు. వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు.