విజయనగరం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందనకు ప్రజల నుండి 212 వినతులు అందాయి. వీటిలో వైద్య శాఖకు 09, డి. ఆర్. డి. ఏకు 20, అందగా అత్యధికంగా రెవిన్యూకు సంబంధించి 143 వినతులు అందాయి. ముఖ్యంగా సదరం, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహాల కోసం విజ్ఞప్తులు వచ్చాయి. ఈ వినతులు జిల్లా కలెక్టరు ఎ. సూర్య కుమారి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డి. ఆర్. ఓ గణపతి రావు, ఉప కలెక్టర్లు సుదర్శనదొర, సూర్యనారాయణ, స్వీకరించారు.