కాంగ్రెస్ నుంచి బయటికొచ్చిన తిరుగుబాటు నేత గులాం నబీ ఆజాద్ జాతీయ స్థాయిలో పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో దేశంలో మరో జాతీయపార్టీ ఏర్పాటయ్యే అవకాశముంది. అయితే తన జాతీయపార్టీ ఏర్పాటుకు కొంత సమయం ఆజాద్ పడుతుందని తెలిపారు. తన జాతీయపార్టీ కార్యకలాపాలు మొదట జమ్ము కశ్మీర్ లోనే మొదలవుతాయన్నారు. సోనియా గాంధీ అంటే తనకు ఎంతో గౌరవమని, కానీ తనను రాహుల్ గాంధీ లెక్క చేయలేదని ఆజాద్ అన్నారు.