కృష్ణా మచిలీపట్నంలో జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమానికి ఎస్సై మోసం చేశాడంటూ మహిళా హోంగార్డు ఫిర్యాదు చేసింది. బంటుమిల్లి ఎక్సైజ్ యస్. ఐ కొమ్మా కిషోర్ పెళ్లి చేసుకుంటానని సహజీవనం చేశాడని, ప్రస్తుతం తన్ను మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తూ, న్యాయం చేయాలని కోరుతూ జిల్లా ఎస్పి ను ఆశ్రయించడం జరిగింది.
లోకల్ న్యూస్ తో మహిళా హోంగార్డు మాట్లాడుతూ, భర్త చనిపోయి ఇద్దరు ఆడ పిల్లలతో ఉంటున్నాను. పెళ్లి చేసుకుంటున్నానని నమ్మించి నాలుగేళ్లుగా కిషోర్ సహజీవనం చేశాడు. పదోన్నతికి డబ్బులు అవసరమంటూ పిల్లల పేరుతో రెండున్నర లక్షలు తీసుకున్నాడు. అడిగితే, ఇప్పుడు నేను యస్సై ఏమీ చేయలేవని బెదిరిస్తున్నాడు. నా డబ్బు నాకు ఇప్పించి, నన్ను పెళ్లి చేసుకోవాలి అని మహిళా హోంగార్డ్ తెలిపింది.