దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని, వడ్డీ రేట్ల పెంపు తప్పదని ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ చేసిన ప్రకటన ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. దీంతో వారు అమ్మకాలకు మొగ్గుచూపారు.
ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 861 పాయింట్లు కోల్పోయి 57,972కి పడిపోయింది. నిఫ్టీ 246 పాయింట్లు నష్టపోయి 17,312కి దిగజారింది. ముఖ్యంగా ఐటీ స్టాకులు భారీగా పతనమయ్యాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి (1.30%), ఏసియన్ పెయింట్స్ (0.61%), నెస్లే ఇండియా (0.52%), ఐటీసీ (0.24%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.20%).