మాజీ సీఎం జయలలిత మృతిపై జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ ప్రతిపాదన మేరకు ఆమె నెచ్చలి శశికళ సహా పలువురిని విచారించాలని తమిళనాడు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు సీఎం స్టాలిన్ అధ్యక్షతన సచివాలయంలో సోమవారం సాయంత్రం మంత్రివర్గం సమావేశమైంది. శశికళ, శివకుమార్‌లతోపాటు నాటి ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, ప్రభుత్వం ప్రధానకార్యదర్శి రామమోహన్ రావు తదితరులపై ప్రభుత్వ విచారణకు ఆదేశించాలని కమిషన్ సిఫార్సు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa