ఏడాదిలో చాలాకాలం పాటు నార్వేలో సూర్యుడు అస్తమించడు. అర్ధరాత్రి కూడా పట్టపగలు మాదిరి ఎండ కొడుతుంది. అందుకే నార్వే దేశాన్ని ల్యాండ్ ఆఫ్ మిడ్‌నైట్ సన్ అని పిలుస్తారు. అక్షాంశానికి ఎక్కువ ఎత్తులో ఉండటం వల్లే ఇక్కడ సూర్యుడు అస్తమించడు. మే నుంచి జూలై మధ్యలో 70 రోజులపాటు నిరంతరం సూర్యుడు ఉంటాడు. నార్వేలోని స్వాల్ బార్డ్‌లో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తుంటాడు.