వినాయక చవితి వేడుకలను భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు లండన్ లో జరుపుకొన్నారు. వెంకయ్య నాయుడు ప్రస్తుతం లండన్ టూర్‌లో ఉన్న విషయం తెలిసిందే. సతీసమేతంగా లండన్ వెళ్లిన వెంకయ్యనాయుడు అక్కడ తన కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. ఈ క్రమంలో బుధవారం వినాయక చవితిని పురస్కరించుకుని...లండన్‌లోనే ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి వేడుకల్లో పాలుపంచుకున్నారు.
లండన్ లో కుటుంబ సభ్యులతో కలిసి వినాయక చవితి వ్రతాన్ని ఆచరించడం ఆనందాన్ని అందించిందని ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ను పెట్టారు. ప్రజలందరికీ తమతమ రంగాల్లో విజయాలను అందించాలని అంబాసుతుణ్ని ప్రార్థించానంటూ ఆయన పేర్కొన్నారు. చవితి వేడుకల్లో పాలుపంచుకున్న తన ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa