పులివెందుల నియోజకవర్గం వేంపల్లి మండలం వేంపల్లి పాపాఘ్ని నది ఒడ్డున వెలసిన శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి దేవస్థానం ఎద్దుల కొండ్రాయుడికి 2 కేజీల 910 గ్రాములతో (2. 910 గ్రాములు) వెండి కిరీటం మరియు కర్ణ పత్రాలు లక్కిరెడ్డిపల్లెకు చెందిన భక్తుడు సగళా కొండయ్య ధర్మపత్ని నాగమణి జ్ఞాపకర్థం స్వామివారికి అందజేశారు. కుటుంబ సభ్యులు ఉమామహేశ్వరి, కుమారుడు సంపత్ కుమార్, కోడలు ప్రవళికతో కలిసి వెండి కిరీటాన్ని ఆలయ ఈఓ శ్రీనివాసులు, ఛైర్మన్ కుర్రాకుల వెంకటేష్, ఆలయ ప్రధాన అర్చకుడు హరి ప్రవీణ్ కు అందజేశారు. దేవస్థానంకు 1. 5కేజీల వెండి కిరీటం బహకరించిన దాతలను దేవస్థానం తరపున ఈఓ శ్రీనివాసులు, ఛైర్మన్ కురాకులవెంకటేష్, పాలకమండలి సభ్యులు పుల్లగూర అరవింద్, గడ్డం బాలాజీ, సిద్దారెడ్డి, తుమ్మల శ్రీను శాలువతో ఘనంగా సత్కరించారు.