అన్నమయ్య జిల్లా సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్. చంద్రశేఖర్ రైల్వేకోడూరు సిఐటియు ఆఫీసులో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు సిపిఎస్ రద్దు కోసం సెప్టెంబర్ ఒకటో తేదీన జరిగే "చలో విజయవాడ" కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం నిర్బంధాన్ని తీవ్రతరం చేయడం దుర్మార్గమని ఉపాధ్యాయ సంఘాల, ఉద్యోగ సంఘాల నాయకులను, ఉపాధ్యాయులను, ఉద్యోగులను బెదిరించి వారిని చలో విజయవాడ చేపట్టకుండా పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించడం సిగ్గుచేటని, అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తామని ఉపాధ్యాయులను, ఉద్యోగులను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేయకుండా పోరాటం చేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులపై బైండోవర్ కేసులు, ఇంటికి వెళ్లి అరెస్టు చేయడం, పోలీస్ స్టేషన్కు పిలిపించడం, కార్యాలయాలకు వెళ్లి బెదిరింపులకు పాల్పడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో లింగాల యానాదయ్య, మండల కన్వీనర్ దాసరి జయచంద్ర పాల్గొన్నారు.