కేంద్ర ప్రభుత్వం ఇంధన ఎగుమతులపై విధిస్తున్న 'విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్'ను మరోసారి సవరించింది. లీటర్ డీజిల్ పై ఎగుమతి పన్నును రూ.7 నుంచి రూ.13.5కు, విమానం ఇంధనం ఏటీఎఫ్ ఎగుమతిపై పన్నును రూ.2 నుంచి రూ.9 కి పెంచింది. పెరిగిన పన్నులు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. అలాగే దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విధిస్తున్న ప్రత్యేక పన్నును టన్నుపై రూ.13,000 నుంచి రూ.13,300కు పెంచింది.