తిరుపతి జిల్లాలో గ్యాంగ్ రేప్ కలకలం రేపుతుంది. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో ఓ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న బాలికను కొందరు యువకులు ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గురువారం బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మత్తు మందు ఇంజక్షన్ ఇచ్చి, తన కుమార్తెను వారు అత్యాచారం చేశారని వాపోయింది. ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.