యూపీలోని మీరఠ్ ప్రాంతంలో అమానవీయ ఘటన జరిగింది. తాను లావు అయ్యాననే కారణంగా భర్త తనకు విడాకుల నోటీసు పంపినట్లు ఓ బాధితురాలు తాజాగా పోలీసులను ఆశ్రయించింది. ఎనిమిదేళ్ల క్రితం సల్మాన్ అనే వ్యక్తితో తనకు వివాహమైందని నెల క్రితం ఇంటి నుంచి గెంటేశాడని వాపోయింది. తమకు ఏడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడని వివరించింది. పోలీసులే తనకు న్యాయనం చేయాలని వేడుకుంది