అండర్ వరల్డ్ డాన్, ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి దావుద్ ఇబ్రహీంపై ఎన్ఐఏ రివార్డు ప్రకటించింది. అతడి గురించి అవసరమైన సమాచారం ఇస్తే రూ.25 లక్షలు ఇస్తామని గురువారం ప్రకటించింది. దావుద్ ఇబ్రహీంతో పాటు అతడి అనుచరులు చోటా షకీల్ పై రూ.20 లక్షలు, అనీస్ ఇబ్రహీం షేక్, జావెద్ చిక్నా, టైగర్ మెమన్ పై రూ.15లక్షల చొప్పున రివార్డు ప్రకటించింది. వీరు 1993 ముంబై పేలుళ్ల ఘటనలో నిందితులుగా ఉన్నారు.