అగ్రిగోల్డ్ బాధితుల పట్ల ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. ఈ నెల 6న కళాక్షేత్రం నుంచి ధర్నా చౌక్ వరకు శాంతియుత నిరసన ర్యాలీ చేపడతామని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. 20వేలు లోపు వారు ఇంకా 3.5 లక్షల మంది బాధితులు ఉన్నారని అన్నారు. వారి పై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోతే మలి దశ ఉద్యమానికి శ్రీకారం చేపడుతామని హెచ్చరించారు.