విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈనెల 26 నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఈవో భ్రమరాంబ తెలిపారు. మూలా నక్షత్రం రోజున సీఎం జగన్ అమ్మవారికి పట్టువస్త్రాలు అందజేస్తారని వెల్లడించారు. భక్తుల కోసం రూ.100, రూ.300 టికెట్ దర్శనాలతో పాటు ఉచిత దర్శనాలను కొనసాగిస్తామని చెప్పారు. ఈ ఏడాది అమ్మవారి దర్శనానికి సుమారు 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. 20 వేల కుంకుమార్చన టికెట్లను ఆన్లైన్లో ఉంచనున్నారు.