ఉద్యోగులు, టీచర్లు ఆందోళనలతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు CPS రద్దు చేసి OPS అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు నల్ల బ్యాడ్జీలతో విద్రోహ దినంగా ఉద్యోగులు పాటిస్తున్నారు. ఫేస్ యాప్ హాజరు వద్దంటూ టీచర్ల సంఘాలు తేల్చి చెబుతున్నాయి. మొండిగా వ్యవహరిస్తే యాప్ డౌన్ చేస్తామని హెచ్చరించాయి. ప్రభుత్వానికి సహకరించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నా తగ్గడం లేదు.