నేడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 13వ వర్ధంతి. వైఎస్ఆర్ పూర్తి పేరు యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి. ఆయన 1949 జూలై 8న జన్మించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2009 వరకు ఆయన ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేశారు. ఆయన 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభలో అడుగుపెట్టారు. మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నికయ్యారు. 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ గెలుపొందారు. సీఎంగా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో కొన్ని ఇప్పటికీ అమలవుతున్నాయి. ఆయన సెప్టెంబర్ 2, 2009 న చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తుండగా నల్లమల అడవులలో సంభవించిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణం పేదల హృదయాల్లో మానని గాయంగా మిగిలిపోయింది.